బట్టతలతో కనిపించిన ప్రభాస్ ఫొటో నెట్టింట వైరల్.. అసలు నిజం ఇదీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బట్టతలతో కనిపించిన ప్రభాస్ ఫొటో నెట్టింట వైరల్.. అసలు నిజం ఇదీ!

Prabhas Photo With Bald Head Goes Viral On Social Media
  • బట్టతలతో కనిపించిన ప్రభాస్‌ ఫొటో చూసి అభిమానులు షాక్
  • నచ్చని వారు ప్రభాస్ ఫొటోను ఎడిట్ చేసి వైరల్ చేసిన వైనం
  • ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి, సాహో వంటి సినిమాలతో ప్రభాస్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా, ప్రభాస్‌కు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ప్రభాస్ ఓ అమ్మాయితో కలిసి నవ్వులు చిందిస్తున్నాడు. ఇందులో విశేషం ఏమీ లేకపోయినా.. ప్రభాస్ ఆ ఫొటోలో బట్టతలతో కనిపించడం చర్చకు దారితీసింది. ఈ ఫొటో చూసి అభిమానులు షాకయ్యారు. అయితే, ఇది ఫేక్ ఫొటో అని తాజాగా తేలింది. ప్రభాస్ అంటే నచ్చని వారు ప్రభాస్ ఫొటోను ఎడిట్ చేసి ఇలా వైరల్ చేసినట్టు తెలిసింది. 

ప్రభాస్ కెరియర్ విషయానికొస్తే ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతంలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా బాక్సాఫీసు వద్ద రూ. 170 కోట్ల నష్టాలు మిగల్చగా, ‘ఆదిపురుష్’ ఏకంగా రూ. 225 కోట్ల నష్టాలు మూటగట్టుకుంది. అయితే, ఇటీవల వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో మళ్లీ విజయాన్ని అందుకున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2, సలార్ 2, రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Advertisement
Prabhas
Prabhas Fake Photo
Tollywood

More Telugu News