సూర్యకుమార్ చేసిన సూపర్ రనౌట్.. వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సూర్యకుమార్ చేసిన సూపర్ రనౌట్.. వీడియో ఇదిగో!

Suryakumar Yadav Direct Throw Sends South Africa Batsman to Pavilion Viral Video
-
సౌతాఫ్రికా టూర్ లో భాగంగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. డైరెక్ట్ థ్రోతో సౌతాఫ్రికా బ్యాట్స్ మన్ కొయిట్టీని పెవిలియన్ కు పంపించాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్ లో జరిగిన ఈ రనౌట్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అర్ష్ దీప్ సింగ్ ఫుల్ టాస్ వేయగా బ్యాట్స్ మన్ కేశవ్ మహరాజ్ దానిని భారీ షాట్ గా మలిచేందుకు ప్రయత్నించాడు. బంతిని బలంగా బాది పరుగు తీసేందుకు ప్రయత్నించాడు. అవతలి ఎండ్ లో ఉన్న గెరాల్డ్ కొయిట్టీ వేగంగా పరుగెత్తినా ఈలోపే బంతిని అందుకున్న సూర్యకుమార్ యాదవ్ వికెట్లకేసి విసిరాడు. కొయిట్టీ క్రీజులోకి చేరేలోపే సూర్యకుమార్ విసిరిన బంతి వికెట్లను గిరాటేసింది. దీంతో కొయిట్టీ రనౌట్ అయ్యాడు. కాగా, నాలుగు టీ20 సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 203 పరుగులు చేయగా.. సౌతాఫ్రికా జట్టు 141 పరుగుల వద్ద కుప్పకూలింది. దీంతో 61 పరుగుల భారీ తేడాతో భారత జట్టు గెలిచింది.

Advertisement
T20 match
Sourth Africa
Suryakumar
Viral Videos

More Telugu News