Telangana: నా అరెస్ట్ కోసం రేవంత్ రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు: కేటీఆర్ ట్వీట్

Revanth Reddy is seeing for my arrest says ktr
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అరెస్ట్ కోసం ఉవ్విళ్లూరుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకిశాల ఘటనలో తనను టార్గెట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. 'సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్‌పై చర్యలేవి?' అంటూ వెలుగు పత్రికలో వచ్చిన వార్తను తన ట్వీట్‌లో జత చేశారు.

తన అరెస్ట్ కోసం సీఎం వేచి చూస్తున్నారని కేటీఆర్ అన్నారు. కానీ సుంకిశాల ఘటనలో మేఘా కృష్ణారెడ్డిని బ్లాక్ లిస్ట్ చేయడానికి ప్రభుత్వానికి దమ్ముందా? మేఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి దమ్ముందా? ఆ ఆంధ్రా కాంట్రాక్టర్‌ని తన ఈస్ట్ ఇండియా కంపెనీని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి తీసేయడానికి దమ్ముందా? పైవాటిని చేసే దమ్ముందా? లేదా? చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. ఓ ముఖ్యమంత్రి అయి ఉండి 'మేఘా'కు గులాంగిరీ చేస్తున్నాడని ధ్వజమెత్తారు.

అరెస్ట్‌లను ఖండిస్తున్నా: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు చేస్తున్న మూసీ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఈ అరెస్ట్‌లను ఎక్స్ వేదికగా ఆయన ఖండించారు. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసిన ప్రతిసారి తమ పార్టీ నేతలను ముందస్తు అరెస్ట్‌లు, హౌస్ అరెస్ట్‌ల పేరుతో నిర్బంధానికి గురిచేయడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.

ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే తమ నేతల హక్కుని ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ఎన్ని నిర్బంధాలకు గురిచేసినా... కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై, హామీల అమలు వైఫల్యంపై నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. నిర్బంధంలోకి తీసుకున్న తమ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ కేటీఆర్ చేశారు.
Go Back to Shorts
Telangana
KTR
BRS
Revanth Reddy

More Telugu News