గెలుపు తర్వాత ట్రంప్ తొలి ప్రసంగం... ఐ లవ్యూ అంటూ ఎలాన్ మస్క్ పై ప్రశంసల జల్లు
Add ap7am to your home Screen

గెలుపు తర్వాత ట్రంప్ తొలి ప్రసంగం... ఐ లవ్యూ అంటూ ఎలాన్ మస్క్ పై ప్రశంసల జల్లు

Donald Trump praises Elon Musk
  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం
  • తన గెలుపులో మస్క్ దే కీలకపాత్ర అన్న ట్రంప్
  • మస్క్ వంటి జీనియస్ లు అమెరికాకు అవసరమని వ్యాఖ్య
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయాన్ని సాధించారు. తన గెలుపు తర్వాత తొలిసారి ప్రసంగించిన ట్రంప్... ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా రాజకీయాల్లో సరికొత్త స్టార్ ఎలాన్ మస్క్ అని వ్యాఖ్యానించారు. 

తన విజయంలో మస్క్ దే కీలకపాత్ర అని చెప్పారు. మస్క్ వంటి జీనియస్ లు అమెరికాకు అవసరమని... అలాంటి వారిని కాపాడుకుంటామని అన్నారు. ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలోని పలు ప్రాంతాల్లో రెండు వారాల పాటు మస్క్ ఎన్నికల ప్రచారం నిర్వహించారని చెప్పారు. మస్క్ నువ్వొక అద్భుతమైన వ్యక్తి... అందుకే ఐ లవ్యూ అని పేర్కొన్నారు.
Advertisement
Donald Trump
Elon Musk
USA

More Telugu News