కాసేపట్లో ట్రంప్ ప్రసంగం
- మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడనున్న ట్రంప్
- ఫ్లోరిడాలోని తన బీచ్ హౌస్ లో వాచ్ పార్టీ
- స్పీచ్ రద్దు చేసుకున్న కమలా హ్యారిస్
మరోవైపు, ఈ ఎన్నికల్లో గెలిచి అమెరికాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించాలని భావించిన కమలా హ్యారిస్ ఫలితాలతో డీలా పడ్డారు. విజయంపై పూర్తి ధీమాతో ముందస్తుగా ఏర్పాటు చేసిన స్పీచ్ ను ఆమె రద్దు చేసుకున్నారు. వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్సిటీలో కమలా హ్యారిస్ మంగళవారం రాత్రి వాచ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆమె మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఈ పార్టీకి హాజరయ్యారు. అయితే, కమలా హ్యారిస్ వెనుకంజలో ఉండడం, ట్రంప్ విజయం దాదాపు ఖరారవడంతో ఆమె మద్దతుదారులు కన్నీళ్లతో ఇళ్లకు వెళ్లిపోతున్నారు. హోవార్డ్ యూనివర్సిటీ నుంచి కమల మద్దతుదారులు విచారంగా బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.