యాక్ష‌న్ సన్నివేశాల చిత్రీక‌ర‌ణ‌.. న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండకు స్వల్ప గాయం
Add ap7am to your home Screen

యాక్ష‌న్ సన్నివేశాల చిత్రీక‌ర‌ణ‌.. న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండకు స్వల్ప గాయం

Actor Vijay Deverakonda Wounded in VD 12 Movie Shooting in Hyderabad
  • గౌత‌మ్ తిన్న‌నూరి, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబోలో 'వీడీ12' మూవీ
  • ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో సినిమా షూటింగ్‌
  • ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను చిత్రీక‌రిస్తుండ‌గా విజ‌య్‌కు స్ప‌ల్ప గాయం
  • ఆసుప‌త్రిలో ఫిజియోథెర‌పీ అనంత‌రం మ‌ళ్లీ షూటింగ్‌లో పాల్గొన్న యువ న‌టుడు
టాలీవుడ్ యువ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న కొత్త‌ చిత్రంలోని యాక్ష‌న్ సన్నివేశాలు చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో గాయ‌ప‌డ్డాడు. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో 'వీడీ12' వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ మూవీ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాలోని ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను చిత్రీక‌రిస్తుండ‌గా విజ‌య్‌కు స్ప‌ల్ప గాయ‌మైంది. 

దాంతో చిత్రం యూనిట్ వెంట‌నే ఆయ‌న‌ను స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించింది. అక్క‌డ ఫిజియోథెర‌పీ చేసిన అనంత‌రం మ‌ళ్లీ విజ‌య్ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్న‌ట్టు స‌మాచారం. ఇక ఈ మూవీలో విజ‌య్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 2025 మార్చి 28న సినిమా విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత రాహుల్ సాంకృత్యాయ‌న్‌, ర‌వికిర‌ణ్ కోలా డైరెక్ష‌న్‌ల‌లో వ‌రుస‌గా రెండు సినిమాల్లో విజ‌య్ న‌టించ‌నున్నాడు.  
Advertisement
Vijay Deverakonda
Hyderabad
Tollywood

More Telugu News