Revanth Reddy: ఈ నెల 8వ తేదీ నుంచి మూసీ పరీవాహక ప్రాంతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 8వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. మూసీ ప్రక్షాళన నేపథ్యంలో ఆయన పాదయాత్రకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. నవంబరు 8న రేవంత్ రెడ్డి పుట్టినరోజు కాగా... ఆ రోజున యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం అనంతరం ఆయన వలిగొండ మండలంలోని మూసీ గ్రామాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు.

పాదయాత్ర సమయంలో మూసీ పరీవాహక ప్రాంతంలోని రైతులు, ప్రజలను రేవంత్ రెడ్డి కలవనున్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకోనున్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తారు. ఈ పాదయాత్రలో జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొననున్నారు.
Revanth Reddy
Telangana
Congress
Padayatra

More Telugu News