Bhopal: అంకుల్ అని పిలిచిన షాప్ ఓనర్ ను చితకబాదిన కస్టమర్.. భోపాల్ లో ఘటన.. వీడియో ఇదిగో!

Bhopal man thrashes shopkeeper for calling him uncle in front of wife
షార్ట్స్‌లో చూడండి
భార్య ముందు తనను అంకుల్ అని పిలవడంపై షాప్ ఓనర్ తో గొడవపడ్డాడో కస్టమర్.. భార్య అడ్డుకుని భర్తను అక్కడి నుంచి తీసుకెళ్లింది. ఆ తర్వాత కాసేపటికే స్నేహితులను వెంటేసుకుని వచ్చి షాప్ ఓనర్ ను చితకబాదాడు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ సిటీలో జరిగిందీ గొడవ. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

భోపాల్ కు చెందిన విశాల్ శాస్త్రికి స్థానికంగా జాట్ ఖేడి ప్రాంతంలో ఓ బట్టల దుకాణం ఉంది. శనివారం ఎప్పటిలాగే తన షాపులో కూర్చున్న శాస్త్రి.. వచ్చిన కస్టమర్లకు బట్టలు చూపిస్తున్నాడు. ఇంతలో భుజాన చంటిపిల్లాడితో ఓ జంట వచ్చింది. చీరలు కావాలనడంతో శాస్త్రి తన షాపులోని వివిధ వెరైటీలను చూపించాడు. ఈ క్రమంలోనే అంకుల్ మీకు ఏ ధరలో కావాలో చెప్పాలంటూ శాస్త్రి ఆ కస్టమర్ ను అడిగాడు. తన భార్య ముందే తనను అంకుల్ అని పిలవడంపై సదరు కస్టమర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

శాస్త్రితో వాగ్వాదానికి దిగాడు. అతడి భార్య సర్దిచెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లింది. గొడవ ముగిసిందని అనుకునేలోపే సదరు కస్టమర్ తన స్నేహితులతో వచ్చి శాస్త్రిపై దాడి చేశాడు. షాపులో నుంచి శాస్త్రిని బయటకు లాగి బెల్ట్, రాడ్, హాకీ స్టిక్ లతో చితకబాదారు. ఇదంతా షాపు ముందున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. శాస్త్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సదరు కస్టమర్ ను రోహిత్ గా గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Go Back to Shorts
Bhopal
uncle
shopkeeper
Customer
Viral Videos

More Telugu News