తాళాలు పగులగొట్టి... ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో దొంగతనం

Theft in RS Praveen Kumar house
  • ఎన్నికలకు ముందు కొమురంభీమ్ జిల్లా కోసినిలో ఇంటిని కొనుగోలు చేసిన ప్రవీణ్ కుమార్
  • బీరువాలోని విలువైన పత్రాలు దొంగిలించినట్లుగా అనుమానం
  • కేసు నమోదు చేసిన పోలీసులు
బీఆర్ఎస్ నాయకుడు, మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో దొంగతనం జరిగింది. కొమురంభీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలో ఆయన ఇల్లు ఉంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్... ఎన్నికలకు ముందు ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఆయన సిర్పూర్ పర్యటనకు వస్తే ఈ ఇంట్లోనే ఉంటారు. అయితే గత రాత్రి ఆయన నివాసంలో దొంగలు పడ్డారు.

రాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి... బీరువా తాళాలు పగులగొట్టి కొన్ని విలువైన పత్రాలు దొంగిలించినట్లుగా తెలుస్తోంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. 

ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. పోలీసులు ఈ సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. సాధారణంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్‌లో ఉన్న సమయంలో ఆ ఇంట్లోనే కొందరు బీఆర్ఎస్ నేతలు ఉంటారని... కానీ బుధవారం రాత్రి మాత్రం ఎవరూ లేరని చెబుతున్నారు.

"తెలంగాణలో దోపిడీ దొంగల పాలన నడుస్తోంది. ఇది ముమ్మాటికీ నిజం. నిన్న సిర్పూర్ కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని మా స్వగృహంలో దొంగలు పడ్డారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోనిపోయారు. దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా తెలంగాణ డీజీపీ గారిని కోరుతున్నాను" అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
RS Praveen Kumar
BRS
Theft

More Telugu News