నాగ చైతన్య - శోభిత వివాహ ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?
- నాగచైతన్య - శోభిత వివాహ ముహూర్తంపై సోషల్ మీడియా వేదికగా అభిమానుల ప్రచారం
- డిసెంబర్ 4న నాగచైతన్య - శోభిత వివాహం
- ధ్రువీకరించిన అక్కినేని కుటుంబ సభ్యులు
నాగచైతన్య - శోభితల వివాహం డిసెంబర్ నెలలో ఉంటుందంటూ బుధవారం ఉదయం నుండి సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే, అధికారికంగా ప్రకటన వెలువడలేదు. తాజాగా ఈ విషయాన్ని అక్కినేని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. వారం రోజుల క్రితం శోభిత తన ఇన్‌స్టా వేదికగా 'గోధుమ రాయి పసుపు దంచటం .. ఇక ఆరంభమైంది' అంటూ పెళ్లి పనులు మొదలు పెట్టినట్లు పరోక్షంగా ప్రకటించి అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అధికారికంగా చెప్పకపోయినా త్వరలోనే పెళ్లి ఉంటుందని అంతా భావించారు. అభిమానులు అందరూ ఊహించినట్లుగానే డిసెంబర్‌లో వివాహ ముహూర్తం ఖరారు అయ్యింది.