మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు... కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి
- నవంబర్‌లో మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు
- స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
- జాబితాలో ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ పేర్లు
మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్లు ఉన్నాయి. జాబితాలో కేసీ వేణుగోపాల్, అశోక్ గెహ్లాట్, ముకుల్ వాస్నిక్, డీకే శివకుమార్, సచిన్ పైలట్, రణ్‌దీప్ సుర్జేవాలా, జి. పరమేశ్వర, ఎంబీ పాటిల్, కన్హయ కుమార్, అల్కా లాంబా తదితరులు కూడా ఉన్నారు.