Manchu Vishnu: కేదార్ నాథ్-బదరీనాథ్ సందర్శించిన మంచు విష్ణు 'కన్నప్ప' బృందం

టాలీవుడ్ కథానాయకుడు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం కన్నప్ప. ఉత్తరాది దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, కన్నప్ప చిత్ర బృందం కేదార్ నాథ్, బదరీనాథ్ క్షేత్రాల సందర్శనకు తరలి వెళ్లింది. 

మంచు విష్ణు, మోహన్ బాబు, దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్ తదితరులు హెలికాప్టర్ లో కేదార్ నాథ్, బదరీనాథ్ క్షేత్రాలకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు సంప్రదాయ దుస్తులు ధరించి దైవ దర్శనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Manchu Vishnu
Kannappa
Kedarnath
Badrinath
Tollywood

More Telugu News