'ఆ కటౌట్​ చూసి అన్నీ నమ్మేయాలి డూడ్'​.. ప్ర‌భాస్‌కు చిరు స్పెష‌ల్‌ బ‌ర్త్‌డే విషెస్​!

Megastar Chiranjeevi Birth Day Wishes to Prabhas
  • నేడు హీరో ప్రభాస్ పుట్టిన‌రోజు
  • సోషల్ మీడియా వేదిక‌గా డార్లింగ్‌కు వెల్లువెత్తుతున్న బ‌ర్త్‌డే విషెస్ 
  • రెబ‌ల్‌స్టార్‌ను విష్ చేస్తూ మెగాస్టార్ స్పెష‌ల్ ట్వీట్‌
నేడు పాన్ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన‌రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక‌గా డార్లింగ్‌కు బ‌ర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఆయ‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తాజాగా రెబ‌ల్‌స్టార్‌ను మెగాస్టార్ చిరంజీవి విష్ చేస్తూ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా చేసిన పోస్ట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

"ఆ కట్ అవుట్ చూసి అన్నీ నమ్మేయాలి డూడ్! అతను ప్రేమించే పధ్ధతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. హ్యాపీ బ‌ర్త్‌డే డార్లింగ్ ప్రభాస్. మీకు ప్రేమ, ఆనందం, గొప్ప కీర్తి ద‌క్కాల‌ని కోరుకుంటున్నాను. ఈ ఏడాది మీకు మ‌రింత అద్భుతంగా ఉండాల‌ని ప్రార్థిస్తున్నాను!" అంటూ చిరు స్పెష‌ల్ గా డార్లింగ్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 

చిరంజీవితో పాటు యూవీ క్రియేష‌న్స్‌, ప్ర‌భాస్ స్నేహితుడు గోపిచంద్‌, క‌న్న‌డ స్టార్ హీరో రిష‌బ్‌ శెట్టి, వైజ‌యంతి మూవీస్ కూడా డార్లింగ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు.  
Advertisement
Chiranjeevi
Prabhas
Birth Day Wishes
Tollywood

More Telugu News