'రాజాసాబ్' నుంచి క్రేజీ అప్‌డేట్‌... మెస్మ‌రైజింగ్ లుక్‌తో అద‌ర‌గొట్టిన‌ డార్లింగ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రాజాసాబ్' నుంచి క్రేజీ అప్‌డేట్‌... మెస్మ‌రైజింగ్ లుక్‌తో అద‌ర‌గొట్టిన‌ డార్లింగ్!

New Poster Released from Raja Saab Movie
  • ప్రభాస్, మారుతి కాంబోలో 'ది రాజాసాబ్'
  • కామెడీ, హర్రర్ థ్రిల్లర్ జానర్లో తెర‌కెక్కుతున్న చిత్రం
  • తాజాగా మూవీ నుంచి కొత్త పోస్ట‌ర్ విడుద‌ల 
  • ఈ నెల 23న డార్లింగ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అసలైన ట్రీట్ ఉంటుంద‌న్న మేక‌ర్స్‌
రెబ‌ల్‌ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న తాజా మూవీ 'ది రాజాసాబ్'. కామెడీ, హర్రర్ థ్రిల్లర్ జానర్లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన పోస్ట‌ర్‌, గ్లింప్స్ అభిమానుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఎల్లుండి (బుధ‌వారం) డార్లింగ్ పుట్టిన‌రోజు సందర్భంగా మేకర్స్ రెండు రోజుల ముందే అభిమానుల‌కు మ‌రో స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. 

ఈ క్రమంలో ఇవాళ‌ సినిమా నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. ప్రభాస్ మెస్మ‌రైజింగ్ లుక్‌తో ఉన్న ఒక స్పెష‌ల్‌ పోస్టర్ విడుద‌ల‌ చేశారు. అక్టోబర్ 23న అసలైన ట్రీట్ ఉంటుందంటూ ఈ పోస్ట‌ర్‌ను మేకర్స్ పంచుకున్నారు. ఇప్పుడీ కొత్త‌ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇక ఈ మూవీలో ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్న విష‌యం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థ‌మ‌న్ బాణీలు అందిస్తున్నారు. 2025 వేసవి సందర్భంగా ఏప్రిల్ 10న 'రాజాసాబ్' ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

ఇదిలాఉంటే... రెబ‌ల్‌స్టార్ కూడా ఇటీవ‌ల వ‌రుస‌గా 'స‌లార్‌', 'క‌ల్కి 2898' వంటి బ్యాక్‌టుబ్యాక్ హిట్ అందుకుని స‌క్సెస్ ట్రాక్ ఎక్కారు. అంత‌కుముందు 'బాహుబ‌లి', 'బాహుబ‌లి-2' త‌ర్వాత‌ వ‌రుస ప్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన విష‌యం తెలిసిందే.
Advertisement
Raja Saab
Prabhas
Tollywood

More Telugu News