ఎన్సీపీ (అజిత్ పవార్)లో చేరిన ముంబై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అల్జాజ్ జావేద్
- ఎక్స్ వేదికగా చేరిక విషయాన్ని పంచుకున్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్
- అదే సమయంలో పూణెలో అజిత్ వర్గానికి చెందిన 600 మంది కార్యకర్తల రాజీనామా
- గవర్నర్ కోటాలో పూణె నగర అధ్యక్షుడు దీపక్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వనందుకు నిరసనగా నిర్ణయం
కాగా, హర్యానా అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపు ధీమాతో ఉన్న కాంగ్రెస్‌కు ఫలితాలు నిరాశ కలిగించాయి. ఈ నేపథ్యంలో త్వరలో మహారాష్ట్ర, ఝార్ఖండ్‌కు జరగనున్న ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ నిన్ననే షెడ్యూల్ ప్రకటించింది. మహారాష్ట్రకు ఒకే విడతలో నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా, ఝార్ఖండ్ అసెంబ్లీకి రెండు విడతలుగా నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్ జరగనుంది. 23న రెండు రాష్ట్రాల ఫలితాలు వెల్లడికానున్నాయి.