పొన్నవోలుకు పోలీసు భద్రత అవసరంలేదన్న ఏపీ హైకోర్టు... పిటిషన్ డిస్మిస్

14-10-2024 Mon 19:37 | Andhra
Advertisement
  • పొన్నవోలుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ
  • భద్రత కల్పించాలని కోరుతూ పొన్నవోలు పిటిషన్
  • సుదీర్ఘ వాదనల తర్వాత తీర్పు రిజర్వ్... తాజాగా తీర్పు వెల్లడి
Advertisement
గత ప్రభుత్వ హయాంలో అదనపు అడ్వొకేట్ జనరల్ గా వ్యవహరించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భద్రత కల్పించాలంటూ పొన్నవోలు దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. పొన్నవోలుకు పోలీసు భద్రత అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు పొన్నవోలు పిటిషన్ ను కొట్టివేసింది.

పొన్నవోలు పిటిషన్ పై హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం... ఇవాళ తీర్పును వెలువరించింది. పొన్నవోలుకు ఏపీ న్యాయవర్గాల్లో సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు ఉంది. ఇవాళ ఆయన సొంత కేసులోనే ఓడిపోయారు.

పొన్నవోలుకు పోలీసు భద్రత అవసరంలేదని హైకోర్టు గతంలో విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. పొన్నవోలు ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదని భద్రతా సమీక్ష కమిటీ నిర్ధారించిన విషయాన్ని కూడా హైకోర్టు అప్పట్లో ప్రస్తావించింది. రివ్యూ కమిటీ నివేదికపై అభ్యంతరాలు ఉంటే సవాల్ చేసుకోవచ్చని పొన్నవోలుకు సూచించింది. తాజాగా హైకోర్టు ఏకంగా పిటిషన్ నే కొట్టివేయడంతో పొన్నవోలుకు తీవ్ర నిరాశ తప్పలేదు.
Advertisement
Ponnavolu Sudhakar ReddySecurityAP High CourtYSRCPAndhra Pradesh

More Telugu News

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27
..more