meesho: ఉద్యోగులకు 'మీషో' బంపర్ ఆఫర్

meesho shared that the employees are going for nine days of paid leave
షార్ట్స్‌లో చూడండి
తమ సంస్థ ఉద్యోగులకు ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం మీషో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తొమ్మిది రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నట్లు తెలిపింది. తమ సిబ్బంది రెస్ట్ తీసుకుని రీ చార్జ్ అయ్యేందుకు ఈ సెలవులు ఇస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. వరుసగా నాలుగో ఏడాది ఈ తరహా బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పింది. తొమ్మిది రోజుల పాటు ల్యాప్ ట్యాప్స్ ఉండవు, ఈ మెయిల్స్ రావు, స్టాండప్ కాల్స్ ఉండవు, ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి పని ఉండదని పేర్కొంది. 

ఈ రెస్ట్ అండ్ రీఛార్జి బ్రేక్ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3వ తేదీ వరకూ ఉండనుంది. మెగా బ్లాక్ బస్టర్ సేల్ తర్వాత పూర్తి విశ్రాంతి తీసుకొని, కొత్త ఏడాది సరికొత్త శక్తిని కూడదీసుకునేందుకు ఈ బ్రేక్ అని మీషో సంస్థ తెలిపింది. ఈ మీషో ప్రకటనకు నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ విధానం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందంటూ ప్రశంసించారు. సిబ్బంది మానసిక, శారీరక ఆరోగ్యానికి మీషో సంస్థ ఎంత విలువ ఇస్తుందో దీనిని బట్టే తెలుస్తోందని మరి కొందరు కామెంట్లు పెట్టారు.
Go Back to Shorts
meesho
employees
paid leave
Business News

More Telugu News