చంద్రబాబు ఉదారత.. స్వగ్రామంలో అమ్మవారి ఆలయానికి దారి చూపిన సీఎం
- స్థలం కొనుగోలు చేసి నారావారిపల్లెలోని నాగాలమ్మ ఆలయానికి దారి చూపిన సీఎం
- ఈ ఆలయానికి వెళ్లేందుకు సరైన దారి లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు
- దాంతో తానే భూమి కొనుగోలు చేసి రాకపోకలకు మార్గం సుగమం చేసిన చంద్రబాబు
ఇక ప్రతియేటా సంక్రాంతి సందర్భంగా కుటుంబసమేతంగా స్వగ్రామానికి వెళ్లే చంద్రబాబు కూడా అమ్మవారికి పూజలు చేయడం ఆనవాయతీ. అయితే, ఈ ఆలయానికి వెళ్లేందుకు సరైన దారి లేదని స్థానికులు ఇటీవల సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
దాంతో వెంటనే స్పందించిన చంద్రబాబు తానే 90 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలం గుండా రాకపోకలకు దారిని ఏర్పాటు చేశారు. దాంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ చంద్రబాబు ఉదారతను కొనియాడుతున్నారు.