Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీలో మద్యం షాపులు బంద్.. మందుబాబులకు తీవ్ర ఇబ్బందులు!

Wine shops closed in Andhra Pradesh
Advertisement
  • నిన్నటితో ముగిసిన వైన్ షాప్స్ కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి
  • విధులకు హాజరు కాలేమన్న కాంట్రాక్టు ఉద్యోగులు
  • ఈ నెల 12 నుంచి కొత్త మద్యం పాలసీ
Advertisement
ఏపీలో మందుబాబులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వైన్ షాపులు బంద్ కావడమే దీనికి కారణం. వైన్ షాపుల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి నిన్నటితో ముగిసింది. అయినప్పటికీ మరో 10 రోజుల పాటు షాపులను తెరవాలని కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం కోరింది. అయితే, ప్రైవేట్ వైన్ షాపులు వస్తున్నాయని... దీంతో, 10 రోజుల తర్వాత తమ ఉద్యోగాలు ఉండవని కాంట్రాక్టు ఉద్యోగులు చెపుతున్నారు. ఈరోజు నుంచి విధుల్లోకి రాలేమని వారు స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా 3,240 వైన్ షాపులు మూతపడ్డాయి. వైన్ షాపులు బంద్ కావడంతో మందుబాబులకు బార్లకు వెళ్లడం మినహా మరో దారిలేకుండా పోయింది. బార్లలో ధరలను భరించలేని వారు... మందు లేక పస్తులు ఉండే పరిస్థితి నెలకొంది!

మరోవైపు, ఈ నెల 12 నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వైన్ షాపులు ఏర్పాటు కానున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి వైన్ షాపులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయింది. దరఖాస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండు విధానాల్లో స్వీకరిస్తున్నారు. ఈ నెల 11న మొత్తం 3,396 వైన్ షాపులకు లాటరీ తీస్తారు. 

టెండర్ దరఖాస్తు రుసుము రూ. 2 లక్షలు కాగా... వైన్ షాపులు దక్కించుకున్న వారు లైసెన్స్ ఫీజుల కింద రూ. 50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్ల కాలపరిమితితో వైన్ షాపులను ప్రభుత్వం మంజూరు చేస్తోంది.
Advertisement
Advertisement
AP Wine Shops

More Telugu News