షేక్ హసీనాను గద్దె దింపడం వెనక కుట్ర.. బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- హసీనా గద్దె దిగడం యాదృచ్ఛికం కాదన్న యూనస్
- పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కుట్రేనని వెల్లడి
- మాఫుజ్ అబ్దుల్లా పేరును ప్రస్తావించిన తాత్కాలిక సారథి
బంగ్లాదేశ్ అల్లర్ల వెనక ఎవరు ఉన్నారో ఇప్పటి వరకు బయటపడలేదని పేర్కొన్న యూనస్.. మాఫుజ్ అబ్దుల్లా పేరును ప్రస్తావించారు. హసీనాను గద్దె దింపడంలో ఆయన హస్తం ఉండొచ్చని అనుమానించారు. హసీనా గద్దె దిగడం యాదృచ్ఛికంగా జరగలేదని, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందేనని నొక్కి వక్కాణించారు. బంగ్లాదేశ్ అల్లర్లు, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి వైదొలగి భారత్‌కు పారిపోయి ఆశ్రయం పొందారు. దీంతో 84 ఏళ్ల యూనస్ దేశ చీఫ్ అడ్వైజర్‌గా నియమితులయ్యారు.