భారత్ - బంగ్లాదేశ్ రెండో టెస్టు.. మ్యాచ్ జరగడం డౌటే!

Rain may effect India Bangladesh secong test
  • కాన్పూర్ వేదికగా ఈ నెల 27 నుంచి రెండో టెస్ట్
  • తొలి రోజున 92 శాతం వర్షం పడే అవకాశం  
  • మ్యాచ్ కు వర్షం ఆటంకంగా మారే అవకాశం
చెన్నైలో బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. కాన్పూర్ వేదికగా ఈ నెల 27 నుంచి రెండో టెస్ట్ జరగనుంది. అయితే రెండో టెస్ట్ జరుగుతుందా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కు వర్షం ఆటంకంగా మారే అవకాశం ఉన్నట్టు వెదర్ అప్డేట్స్ వచ్చాయి. 

రెండో టెస్ట్ తొలిరోజున వర్షం పడే అవకాశం 92 శాతం ఉందని ప్రముఖ వాతావరణ వెబ్ సైట్ 'అక్యూవెదర్' తెలిపింది. ఈ వర్షం తొలిరోజు ఆటపై ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పింది. మ్యాచ్ రెండో రోజున 49 శాతం, మూడో రోజున 65 శాతం, నాలుగో రోజున 56 శాతం వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
Go Back to Shorts
IND Vs BAN
Secong Test
Rain

More Telugu News