సీఎం చంద్రబాబు చొరవతో పూర్తి ఆరోగ్యవంతుడైన మూడేళ్ల బాలుడు దేవాన్ష్
- చిన్నారి కోసం యంత్రాంగాన్ని పరుగులు తీయించిన చంద్రబాబు
- టైఫాయిడ్ బాధిత బాలుడి కోసం ఇంటికే వైద్య బృందాన్ని పంపిన ముఖ్యమంత్రి
- కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్సకు వెంటనే ఎల్ఓసీ
ఏంచేయాలో పాలుపోని స్థితిలో విషయం సీఎం పేషీలో హెల్త్ డిపార్ట్‌మెంట్ చూసే అధికారులకు చేరింది. బాలుడి పరిస్థితి గురించి సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో వెంటనే స్పందించారు. ఎలాగైనా సరే దేవాన్ష్ ప్రాణాలను కాపాడాలని సీఎంఓలోని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఆఘమేఘాలపై వెంటనే మెడికల్ టీంను నేరుగా ఇంటికి పంపి అవసరమైన వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత వారు మెరుగైన చికిత్స కోసం యుద్ధ ప్రాతిపదికన ఎల్ఓసి ఇచ్చి విజయవాడ ఏలూరు రోడ్డులోని రెయిన్ బో ఆసుపత్రిలో చేర్పించారు.
దాదాపు 11 రోజుల పాటు చికిత్స అనంతరం బాలుడు కోలుకున్నాడు. చికిత్స అందుతున్న 11 రోజుల పాటు దేవాన్ష్ ఆరోగ్య పరిస్థితిపై సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఆసుపత్రి యాజమాన్యంతో సంప్రదించి ఎప్పటికప్పుడు సీఎంకు తెలియజేశారు. పూర్తి ఆరోగ్యవంతుడైన దేవాన్ష్ తల్లిదండ్రులతో కలిసి ఇంటికి చేరుకున్నాడు. తమ బిడ్డకు పునర్జన్మ నిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రత్యేక చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు వైద్య సేవలపై వాకబు చేసిన సీఎం పేషీ అధికారులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.