Vijayasai Reddy: విజయసాయిరెడ్డి కూతురు స్థలంలో మరోసారి నిర్మాణాల కూల్చివేత

Deomolition works in Vijayasai Reddy daughters land
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి చెందిన స్థలంలోని కాంక్రీట్ నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. విశాఖ జిల్లా భీమిలిలో సర్వే నెంబర్ 1516, 1517, 1519, 1523లో ఉన్న స్థలంలో ఈ కట్టడాలు ఉన్నాయి. సుమారు 4 ఎకరాలు ఉన్న ఈ ఆక్రమిత స్థలంలో అక్రమ కట్టడాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 

ఈ ఆక్రమణలపై ఇటీవలే ఏపీ హైకోర్టులో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పిల్ వేశారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో 2 వారాల క్రితమే జీవీఎంసీ అధికారులు నిర్మాణాల తొలగింపును చేపట్టారు. తాజాగా ఈరోజు మరోసారి కూల్చివేతల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Go Back to Shorts
Vijayasai Reddy
daughter
YSRCP

More Telugu News