ఐఫోన్ 16 కోసం ఎగబడ్డ జనం.. తెల్ల‌వారుజాము నుంచే యాపిల్ స్టోర్ల ముందు భారీ క్యూ లైన్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐఫోన్ 16 కోసం ఎగబడ్డ జనం.. తెల్ల‌వారుజాము నుంచే యాపిల్ స్టోర్ల ముందు భారీ క్యూ లైన్లు!

Apple Begins iPhone 16 Series Sale in India
  • ముంబై, ఢిల్లీ స‌హా ప‌లు నగరాలలోని యాపిల్ స్టోర్‌ల ముందు బారులు తీరిన‌ కొనుగోలుదారులు
  • ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్ల‌స్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ వేరియంట్ల‌లో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు
  • యాపిల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ), కొత్త చిప్ ఏ18తో వ‌చ్చిన మొబైల్స్‌
  • ఐఫోన్ 16 ప్రారంభ ధ‌ర రూ. 79,900
  • ఐఫోన్ 16 ప్ల‌స్ ప్రారంభ ధ‌ర రూ. 89,900
టెక్ ప్రియులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం దేశ‌ వ్యాప్తంగా శుక్ర‌వారం తెల్ల‌వారుజాము నుంచి ప్రారంభ‌మైంది. ఈ ఫోన్‌ల‌ను కొనుగోలు చేసేందుకు జ‌నాలు తెల్ల‌వారుజాము నుంచే యాపిల్ స్టోర్‌ల ముందు బారులు తీరారు. 

ముంబై, ఢిల్లీ స‌హా ప‌లు నగరాలలోని యాపిల్ స్టోర్‌ల ముందు కొనుగోలుదారులు భారీగా క్యూ క‌ట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

ఇక ఇటీవ‌ల యాపిల్ సంస్థ‌ ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్ల‌స్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్ అనే నాలుగు వేరియంట్ల‌లో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. 

యాపిల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ), కొత్త చిప్ ఏ18తో వ‌చ్చిన ఈ మొబైల్స్‌లో అధునాత‌న కెమెరా కంట్రోల్ బ‌ట‌న్, యాక్ష‌న్ బ‌ట‌న్ అనే రెండు కొత్త బ‌ట‌న్ల‌ను యాపిల్ జ‌త చేసింది‌. చూడ‌గానే ఆక‌ట్టుకునే డిజైన్ వీటి సొంతం. 

కాగా, ఐఫోన్ 16 ప్రారంభ ధ‌ర రూ. 79,900, ఐఫోన్ 16 ప్ల‌స్ ప్రారంభ ధ‌ర రూ. 89,900, ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధ‌ర రూ. 1,19,900, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభం ధ‌ర రూ. 1,44,900గా సంస్థ నిర్ణ‌యించింది.
Advertisement
iphone 16 Series
India
Apple iPhone

More Telugu News