సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద బ్యాగు కలకలం

Bag found near CM Revanth Reddy house
  • జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి సమీపంలో కనిపించిన నల్లటి బ్యాగు
  • తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో పరిశీలించిన సెక్యూరిటీ విభాగం
  • బ్యాగును స్వాధీనం చేసుకున్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద నిన్న ఓ బ్యాగు కనిపించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో నల్లటి రంగులోని ఓ బ్యాగు కనిపించింది. ఈ బ్యాగు గురించి ఎవరూ రాకపోవడంతో పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం మెటల్ డిటెక్టర్‌తో బ్యాగును పరిశీలించి, దానిని స్వాధీనం చేసుకుంది.
Go Back to Shorts
Revanth Reddy
Telangana
Crime News

More Telugu News