Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంగళగిరి బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం

Nara Lokesh helps Mangalagiri badminton player
Advertisement
  • యువ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్న నారా లోకేశ్
  • నిన్న లోకేశ్ ను కలిసి తన పరిస్థితి వివరించిన చరణ్ నాయక్
  • చరణ్ నాయక్ యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు
  • ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ర్యాంకింగ్ టోర్నీల్లో ఆడే అవకాశం
  • ఆ రెండు టోర్నీల్లో ఆడేందుకు లోకేశ్ ఆర్థిక సహకారం
Advertisement
ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఏపీ మంత్రి నారా లోకేశ్ మరోసారి నిరూపించుకున్నారు. తాజాగా, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కె.చరణ్ నాయక్ కు ఆర్థిక చేయూతనిచ్చారు. 

చరణ్ నాయక్ అంతర్జాతీయ స్థాయిలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలో సత్తా చాటుతున్నాడు. ఆస్ట్రేలియాలో అక్టోబరు 16 నుంచి 20 వరకు... న్యూజిలాండ్ లో 23 నుంచి 26 వరకు జరగనున్న అంతర్జాతీయ ర్యాంకింగ్ పోటీల్లో చరణ్ నాయక్ పాల్గొంటున్నాడు. 

ఈ నేపథ్యంలో, రెండు విదేశీ పర్యటనలు చేయాల్సి రావడంతో, ఈ యువ క్రీడాకారుడు ఆర్థికసాయం కోరుతున్నాడు. నిన్న మంత్రి నారా లోకేశ్ ను కలిసి తన పరిస్థితిని వివరించాడు. చరణ్ నాయక్ గురించి తెలుసుకున్న నారా లోకేశ్.... అతడి విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించారు. 

'ప్రైడ్ ఆఫ్ మంగళగిరి' పేరిట అతడికి ఆర్థికసాయం చేశారు. ఈ మేరకు, స్థానిక టీడీపీ నేతల ద్వారా రూ.3 లక్షలు చరణ్ నాయక్ కు అందించారు. లోకేశ్ తనకు ఆర్థికసాయం చేయడం పట్ల ఆ యువ షట్లర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాడు.
Advertisement
Advertisement
Nara Lokesh
Charan Naik
Badminton
Ranking Tournaments
Mangalagiri
TDP
Andhra Pradesh

More Telugu News