అధికారంలోకి వచ్చాక గంటలోపల బీహార్ లో మద్యపాన నిషేధం ఎత్తివేస్తాం.. ప్రశాంత్ కిశోర్
- తేజస్వీ యాదవ్ యాత్రపై వ్యంగ్యంగా స్పందించిన పీకే
- తొమ్మిదో తరగతి ఫెయిలైన లీడర్ బీహార్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడని సెటైర్
- ఆర్జేడీ, జేడీయూ రెండూ బీహార్ ను ముంచేశాయని వ్యాఖ్య
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరినందుకు నితీశ్ కుమార్ ముకులిత హస్తాలతో క్షమాపణలు చెప్పారంటూ తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. ‘ఎవరు ఎవరికి ముకులిత హస్తాలతో క్షమాపణలు కోరారో తెలియదు కానీ నితీశ్, తేజస్వీ.. ఇద్దరూ బీహార్ కు నష్టం చేశారు’ అని చెప్పారు. బీహార్ కు సీఎం కావాలని ఆశిస్తున్న తేజస్వీ యాదవ్ కు ఉన్న అర్హత ఏంటని ప్రశాంత్ కిశోర్ నిలదీశారు. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు కావడం తప్పితే తేజస్వీకి నాయకత్వం వహించేందుకు ఎలాంటి అర్హత లేదని కొట్టిపారేశారు.