Pawan Kalyan: 'కేబీసీ'లో పవన్ కల్యాణ్ పై ప్రశ్న

pawan kalyan question in kaun banega karodpati
షార్ట్స్‌లో చూడండి
సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ..రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. తన పార్టీ నుండి పోటీ చేసిన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలనూ అత్యధిక మెజారిటీతో గెలుచుకుని రాజకీయాల్లోనూ హైలైట్ గా నిలిచారు. దీంతో పవన్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ తరుణంలో ప్రఖ్యాత కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ప్రశ్నను అడగడం విశేషంగా మారింది. 

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి 16వ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను పవన్‌కు సంబంధించిన ప్రశ్నను అడిగారు. 2024 జూన్ లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు అని బిగ్‌బీ ప్రశ్నను సంధించారు. అయితే కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు సమాధానం తెలియక ఆడియన్స్ పోల్ ఆప్షన్ ఎంచుకున్నాడు. ఆడియెన్స్‌లలో 50 శాతం మందికి పైగా పవన్ కల్యాణ్ అని చెప్పడంతో కంటెస్టెంట్ వారు చెప్పిన సమాధానానికే లాక్ చేశాడు. అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్ రూ.1.60లక్షలు గెలుచుకుని తర్వాత ప్రశ్నకు వెళ్లాడు.
Go Back to Shorts
Pawan Kalyan
Kaun Banega Karodpati
Amitabh Bachchan

More Telugu News