రాహుల్ గాంధీ ‘పప్పు’ కాదు: శామ్ పిట్రోడా
- అమెరికాలోని డాలస్ లో రాహుల్ పై ప్రశంసలు
- ఉన్నత విద్యావంతుడు, దార్శనికుడంటూ పొగడ్త
- కొన్నిసార్లు ఆయనను అర్థం చేసుకోవడం కష్టమని వెల్లడి
ఏ అంశంపైనైనా లోతుగా ఆలోచించే వ్యూహకర్త, రాహుల్ ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదన్నారు. అయితే, ఆయనపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, కోట్లు కుమ్మరించి మరీ రాహుల్ ను కించపరుస్తోందని శామ్ పిట్రోడా మండిపడ్డారు. కాగా, రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం టెక్సాస్ లోని డాలస్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ కు ఎన్ఆర్ఐలు ఘనంగా స్వాగతించారు.