ట్రంప్‌కు షాక్.. అధ్యక్ష పీఠం కమలా హారిస్‌దే.. జోస్యం చెప్పేసిన యూఎస్ నోస్ట్రడామస్
- నాలుగు దశాబ్దాలుగా జోస్యం చెబుతున్న లిచ్‌మన్
- 2016లో ట్రంప్, 2020లో బైడన్ ఎన్నికవుతారని చెప్పిన హిస్టరీ ప్రొఫెసర్
- నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు
- ట్రంప్-కమలా హారిస్ మధ్య హోరాహోరీ పోటీ
సరిగ్గా మరో రెండు నెలల్లో అంటే నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ నువ్వా? నేనా? అన్నట్టుగా సాగుతోంది. అమెరికన్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న లిచ్‌మన్ 4 దశాబ్దాలుగా చెబుతున్న జోస్యాలు నిజమవుతున్నాయి. అందుకే ఆయనంటే అందరికీ గురి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవుతారని 2016లో ఆయన చెప్పిన జోస్యం నిజమైంది. అలాగే, 2020లో బైడన్‌దే విజయమని చెప్పారు. ఇప్పుడు కమలా హారిస్‌దే విజయమని అంచనా వేశారు.