ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలి: ఈటల రాజేందర్
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తాయన్న ఈటల
- మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల సాయం చేయాలని డిమాండ్
- సహాయక కార్యక్రమాల్లో బీజేపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపు
కోతకు గురైన చెరువులకు వెంటనే మరమ్మతులు చేయాలని ఈటల సూచించారు. వరదల కారణంగా కొట్టుకుపోయిన పంటలకే కాకుండా, నీటిలో నానిన పంటకు కూడా నష్టపరిహారం ఇవ్వాలన్నారు. పంట కోల్పోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని కోరారు.
ఇళ్లను కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టం తీరును అంచనా వేసిన తర్వాత కేంద్రం ఆదుకుంటుందని చెప్పారు. వరద బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని... సహాయక కార్యక్రమాల్లో బీజేపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.