ఏపీలో వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోదీ
ప్రస్తుతం రాష్ట్రంలో చేపడుతున్న వరద సహాయ చర్యలను సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి వివరించారు. అందుకు మోదీ స్పందిస్తూ... ఇప్పటికే కేంద్రంలోని పలు శాఖలను ఆదేశించామని, రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని స్పష్టం చేశామని వెల్లడించారు. తక్షణమే ఆయా శాఖల నుంచి ఏపీకి అవసరమైన సామగ్రి పంపాలని ఆదేశించామని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు.