Ganta Srinivasa Rao: అలా చేసిన‌ వారిని మాత్ర‌మే టీడీపీలోకి ఆహ్వానిస్తున్నాం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasa Rao Comments on YSRCP
షార్ట్స్‌లో చూడండి
వైసీపీకి కీల‌క నేత‌లు ఒక్కొక్క‌రు గుడ్ బై చెబుతున్నారు. ఆ పార్టీని వీడుతున్న నేత‌లు టీడీపీ, జ‌న‌సేన గూటికి చేరుతున్నారు. తాజాగా రాజ్య‌స‌భ స‌భ్యులు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీద మ‌స్తాన్ రావు కూడా వైసీపీ పార్టీకి, రాజ్య‌స‌భ ఎంపీ ప‌ద‌వుల‌కు ఏక‌కాలంలో రాజీనామా చేశారు. మోపిదేవి టీడీపీలో చేర‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు కూడా. ఈ క్ర‌మంలో ఇంకొంద‌రు వైసీపీ నేత‌లు కూడా టీడీపీ వైపు చూస్తున్న‌ట్లు స‌మాచారం. 

ఈ నేప‌థ్యంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాట్లాడుతూ, ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ దారుణ ప‌రాజ‌యాన్ని చ‌విచూసింద‌ని అన్నారు. ఆ పార్టీని మునిగిపోయిన నావ అని పేర్కొన్నారు. 

అలాగే వైసీపీలో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌ప్ప ఎవ‌రూ మిగ‌ల‌ర‌ని ఎద్దేవా చేశారు. త‌మ ప‌ద‌వులకు రాజీనామా చేసి టీడీపీలో చేర‌తామంటే స్వాగ‌తిస్తామ‌ని గంటా శ్రీనివాస‌రావు అన్నారు.
Go Back to Shorts
Ganta Srinivasa Rao
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News