గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి
- వైఎస్ఆర్ జిల్లా గువ్వల చెరుపు ఘాట్ రోడ్డులో ఢీకొన్న కారు – కంటైనర్
- కారులో ప్రయాణిస్తున్న నలుగురు, కంటైనర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి
- ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ హర్షవర్థన్ రాజు
కాగా, రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్‌పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును, అందుకు గల కారణాలను నిశితంగా పరిశీలించారు. ప్రమాద ఘటనపై జిల్లా ఎస్‌పీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్‌పీ వెంట ఎస్‌బి ఇన్స్‌పెక్టర్ యు. వెంకటకుమార్, సి.కె దిన్నె సీఐ శంకర్ నాయక్, రామాపురం సీఐ వెంకట కొండారెడ్డి సిబ్బంది ఉన్నారు.