చిత్రహింసలకు గురిచేస్తున్నారు... నారా లోకేశ్ కాపాడాలి... ఓ మహిళ వీడియో
- కువైట్‌లో కాకినాడ జిల్లాకు చెందిన మహిళ ఇక్కట్లు
- యజమాని చిత్రహింసలు పెడుతున్నాడంటూ ఆవేదన
- ఇండియాకి వెంటనే తీసుకురావాలంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన నాగమణి
కువైట్‌లో తన యజమాని చిత్ర హింసలు పెడుతున్నాడని, వెంటనే ఇండియాకి తీసుకురావాలని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లికి చెందిన మహిళ నాగమణి సెల్ఫీ వీడియోలో వేడుకుంది. తన ఆరోగ్యం క్షీణించిందని, నోటి నుండి రక్తం వస్తున్నా యజమాని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రి నారా లోకేశ్ చొరవ తీసుకుని తనను ఈ నరకం నుండి కాపాడాలని ఆమె వేడుకోవడం వీడియోలో ఉంది.