హెజ్బొల్లా టార్గెట్ గా లెబనాన్ పై రాకెట్ల వర్షం కురిపించిన ఇజ్రాయెల్
- వంద ఫైటర్ జెట్లతో లెబనాన్ లోకి చొచ్చుకెళ్లి మరీ దాడి
- రాకెట్ లాంఛర్ బారెల్స్ ద్వంసం
- ఇజ్రాయెల్ పైకి 320 క్షిపణులు ప్రయోగించిన హెజ్బొల్లా
ఫాద్ షుక్రు హత్యకు ప్రతీకారం..
తమ నేత ఫాద్ షుక్రు హత్యకు ప్రతీకారంగా తొలివిడత దాడిని మొదలుపెట్టినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. ఇజ్రాయెల్ లోని 11 స్థావరాలను లక్ష్యంగా చేసుకొని 320 కత్యూషా రాకెట్లను ప్రయోగించినట్లు వివరించింది. కాగా, సైనిక శిక్షణ, ఆయుధ సరఫరా విషయంలో హెజ్బొల్లాకు ఇరాన్ పూర్తి సహకారం అందిస్తున్నట్లు సమాచారం. సిరియా పాలకులు కూడా హెజ్బొల్లాకు అండగా ఉన్నట్లు అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. 2022 లో జరిగిన లెబనాన్ పార్లమెంట్ ఎన్నికల్లో హెజ్బొల్లా సంస్థ 13 సీట్లు గెలుచుకుంది. అయితే, హెజ్బొల్లాను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.