అక్రమ నిర్మాణమంటూ అనురాగ్ యూనివర్సిటీపై ఫిర్యాదు... పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు
- అనురాగ్ యూనివర్సిటీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ శాఖ
- చెరువును కబ్జా చేసి భారీ నిర్మాణం చేపట్టారని ఫిర్యాదు
- ఎమ్మెల్యేపై పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నాడెం చెరువు బఫర్ జోన్లో 1.5 ఎకరాల భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్ స్టిట్యూషన్స్ సంస్థ అక్రమ నిర్మాణాలు చేపట్టిందంటూ ఇరిగేషన్ శాఖ ఏఈ పరమేశ్... పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.