డైరెక్టర్ వీవీ వినాయక్ కు మేజర్ లివర్ సర్జరీ

Film director VV Vinayak undergone major surgery
  • కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న వినాయక్
  • ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రిలో వినాయక్ కు శస్త్రచికిత్స
  • ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ కూడా చేయని స్టార్ డైరెక్టర్
టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు... వీవీ వినాయక్. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. వినాయక్ కు మేజర్ సర్జరీ జరిగింది. కాలేయానికి డాక్టర్లు శస్త్రచికిత్స నిర్వహించారు. ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రిలో ఆయన కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు సమాచారం. 

రాయదుర్గంలో కొన్నేళ్ల క్రితం ఆయన ఒక భారీ బంగ్లాను నిర్మించుకున్నారు. ఇటీవలే దాన్ని అమ్మేసి... కోకాపేట్ లో ఒక ఖరీదైన అపార్ట్ మెంట్ లోకి షిఫ్ట్ అయ్యారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వినాయక్ హీరోగా ఒక సినిమాను అనౌన్స్ చేశారు. కానీ పలు కారణాలతో ఆ చిత్రం పట్టాలెక్కలేదు.

చివరిగా 'ఛత్రపతి' సినిమాను ఆయన హిందీలోకి రీమేక్ చేశారు. సాయి శ్రీనివాస్ హీరోగా తెరక్కిన ఈ చిత్రాన్ని గత ఏడాది విడుదల చేశారు. అయితే, ఈ సినిమా పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఆ తర్వాత ఆయన ఎలాంటి ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు.
Go Back to Shorts
VV Vinayak
Surgery
Tollywood

More Telugu News