Nani: నాకు కోపం తక్కువే: హీరో నాని

Nani Interview
షార్ట్స్‌లో చూడండి
'హాయ్ నాన్న' తరువాత నాని నుంచి ఇంతవరకూ మరో సినిమా రాలేదు. ఆ తరువాత సినిమాగా ఆయన చేసిన 'సరిపోదా శనివారం' ఈ నెల 29వ తేదీన విడుదల కానుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని బిజీగా ఉన్నాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడాడు. 

"ఒక కథను ఒప్పుకోవడానికి నేను తీవ్రంగా ఆలోచన చేయను. ఆ కథ వింటున్నప్పుడే ఈ సినిమా మనం చేస్తే బాగుంటుందే అనిపిస్తుంది. సినిమాగా తెరపై ఊహించుకున్నప్పుడు అదిరిపోతుందే అనిపిస్తుంది. ఇంతమంచి కథను మిస్సవ్వకూడదని బలంగా అనిపించినప్పుడు ఓకే చెబుతాను" అని అన్నాడు. 

"మా ఇంట్లో నాకు .. మా ఆవిడకి ఇద్దరికీ కోపం తక్కువనే చెప్పాలి. ఇద్దరం చాలా కూల్ గానే ఉంటాము. నా సినిమాల విషయంలో తన అభిప్రాయాన్ని తప్పకుండా అడుగుతూ ఉంటాను. అప్పుడప్పుడు కాస్త మొహమాటపడినప్పటికీ, ఆ తరువాత నిజాయితీగా చెబుతూ ఉంటుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది" అని చెప్పాడు.

Go Back to Shorts
Nani
Priyanka Mohan
Vivek Athreya

More Telugu News