Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు లేవు: జగన్

Jagan reacts on Tadipatri incidents
Advertisement
  • చాలారోజుల తర్వాత సొంత నియోజకవర్గానికి తిరిగొచ్చిన పెద్దారెడ్డి
  • తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు... ఉద్రిక్తత
  • ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నాయన్న జగన్ 
Advertisement
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగుపెట్టగానే ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, జరిగిన ఘర్షణలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. 

ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు రాష్ట్రంలో లేవని విమర్శించారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లినా టీడీపీ మూకలు అడ్డుకున్నాయని జగన్ ఆరోపించారు. తాడిపత్రిలో వైసీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టారని, వాహనాలను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కింది స్థాయిలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే... నేరం చేయాలంటేనే భయపడాలంటూ పైన ఉన్న చంద్రబాబు కబుర్లు చెబుతున్నారని... ఇంతకన్నా సిగ్గులేనితనం ఏముంటుందని జగన్ ధ్వజమెత్తారు.
Advertisement
Advertisement
Jagan
Tadiptari
Kethireddy Peddareddy
YSRCP
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News