Chandrababu: కైలాసపట్నం ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో ఓ అనాథాశ్రమంలో కలుషితాహారం తిని ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. విద్యార్థుల మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.
అనధికార హాస్టల్ ను మూసివేయాలని ఆదేశించారు. ఆ అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న చిన్నారుల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని చంద్రబాబు వెల్లడించారు. అస్వస్థతకు గురైన చిన్నారుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.