పాకిస్థాన్‌లో పుట్టి తెలుగు తెరకు పరిచయం అవుతున్న కొత్త భామ.. వీడియో ఇదిగో!

Iman Esmail Is The New Actress Stepped In Tollywood
తెలుగు తెరపై మరో కొత్త భామ మెరవబోతోంది. ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో ఇమాన్ ఎస్మాయిల్ నాయికగా నటించబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నిన్ననే ప్రారంభమైంది. పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీతో ఇమాన్ టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తోంది. పీరియాడికల్ డ్రామా అయిన ఈ మూవీలో ప్రభాస్ జవానుగా కనిపించబోతున్నాడు. ఈ మూవీ కోసం రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్‌ను కూడా నిర్మించారు. 

ఇక, ఇమాన్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. పాకిస్థాన్‌లో జన్మించిన ఆమె ఢిల్లీలో స్థిరపడింది. మంచి డ్యాన్సర్ కూడా. ఆన్‌లైన్‌లోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. చూడ్డానికి ఆమె సౌందర్యలా ఉందని, పెద్ద హీరోయిన్ కావడం పక్కా అంటూ అప్పుడే సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
Advertisement
Iman Esmail
Tollywood
Prabhas

More Telugu News