రైలు పట్టాలపై బండరాయి.. ఢీకొట్టి పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్
- బండరాయి తాకడంతో ఇంజిన్ ధ్వంసం
- పట్టాలు తప్పిన 22 బోగీలు
- ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
- ప్రయాణికులను బస్సుల్లో గమ్యస్థానానికి చేర్చిన రైల్వే
రైల్వే ట్రాక్‌పై ఉన్న వస్తువును ఇంజిన్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టమూ సంభవించలేదని, ఒక్కరికి కూడా గాయాలు కాలేదని చెప్పారు.
సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు ఘటనా స్థలం వద్దకు బస్సులు పంపించారు. వాటి ద్వారా ప్రయాణికులను అహ్మదాబాద్ పంపే ప్రయత్నం చేశారు. ఓ పెద్ద బండరాయి ఇంజిన్‌కు తాకడంతో అది బాగా దెబ్బతిందని, ప్రమాదానికి అదే కారణమని లోకో పైలట్ తెలిపాడు. రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన పదుల సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.