సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఎఫెక్ట్.. రేగ కాంతారావు ముందస్తు అరెస్టు
- బానోత్ హరిప్రియను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు
- భద్రాద్రి జిల్లాకు నీళ్లు ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యేల ఆందోళన
- వైరాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల అరెస్టు
పంప్ హౌజ్ ప్రారంభోత్సవం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైరా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడతారు. రూ. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి నిధులను విడుదల చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సీఎం టూర్ సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, బానోత్ హరిప్రియ ఆందోళన చేపట్టారు. దీంతో వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.