మా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తావా?.. మస్క్ కు ట్రంప్ జాబ్ ఆఫర్
- మస్క్ అంగీకరిస్తే ఎంతగానో సంతోషిస్తానన్న ట్రంప్
- ఖర్చులు తగ్గించడంలో మస్క్ నిపుణుడంటూ మెచ్చుకోలు
- టాక్స్ పేయర్ల సొమ్ము వృథా కాకూడదనేదే తన ఉద్దేశమని వెల్లడి
ఎక్స్ తో పాటు మస్క్ కంపెనీలలో కాస్ట్ కట్టింగ్ చాలా ప్రభావవంతంగా ఉందని, ఖర్చుల నియంత్రణలో మస్క్ గొప్ప నిపుణుడని ట్రంప్ కొనియాడారు. ఈ విషయం గుర్తించాను కాబట్టే మస్క్ కు జాబ్ ఆఫర్ చేశానని వివరించారు. టాక్స్ పేయర్ల నుంచి ప్రభుత్వానికి చేరే సొమ్మును జాగ్రత్తగా వినియోగించాలనేదే తన అభిమతమని, టాక్స్ పేయర్ల కష్టార్జితాన్ని వృథా చేయడం తనకు ఇష్టం లేదని ట్రంప్ చెప్పుకొచ్చారు.
మస్క్ కనుక ఈ బాధ్యతను స్వీకరిస్తే అమెరికాకు గొప్ప ప్రయోజనం చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ ఆఫర్ కు మస్క్ జవాబివ్వనప్పటికీ వారిద్దరి మధ్య ఇప్పటికే దీనిపై చర్చ జరిగిందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ట్రంప్ ప్రెసిడెంట్ గా ఎన్నికైతే ప్రభుత్వంలో మస్క్ ఎలాంటి పాత్ర పోషించాలనే విషయంపై వారు చర్చించుకున్నట్లు తెలిపింది.