రూ. 3 కోట్ల విలువైన గౌతమి భూమి కబ్జా.. న్యాయం జరిగే వరకు పోరాడతానన్న సినీ నటి
- గౌతమి భూమి కబ్జా.. వేరొకరికి విక్రయం
- నిందితులు ఏడాదిగా బెయిలుపైనే
- మరోమారు బెయిలు పిటిషన్ పెట్టుకున్న నిందితులు
- అభ్యంతరం వ్యక్తం చేసిన నటి తరపు లాయర్
తనను మోసం చేసిన అళగప్పన్, ఆయన భార్య నాచ్చాళ్, కుమారుడు శివ, కోడలు ఆర్తి, బంధువులపై కేసులు పెట్టారు. ఏడాదిగా వారంతా బెయిలుపై ఉన్నారు. తాజాగా, నిందితులు మరోమారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ నిన్న విచారణకు వచ్చింది. గౌతమి తరపున హాజరైన న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ వారికి బెయిలు ఇవ్వకూడదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.