తుపాకీ పట్టుకుని డ్యాన్స్.. తిహార్ జైలు అధికారిపై వేటు!
ఓ కార్యక్రమానికి హాజరైన దీపక్ శర్మ డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో రివాల్వర్‌ను చుట్టూ ఉన్న వారిపై గురిపెడుతున్నట్టు పోజు పెట్టి డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో జైళ్ల శాఖ దృష్టికి వెళ్లింది. ఘటనను సమీక్షించిన ఉన్నతాధికారులు దీపక్ శర్మను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.