ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్, మాజీ ఏఏజీ పొన్నవోలుకు హైకోర్టు నోటీసులు
- పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా, మీడియా సమావేశాలను నిర్వహించారంటూ ఆరోపణలు
- ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ హైకోర్టులో పిల్
- పిల్‌ను పరిశీలించిన హైకోర్టు సీజే ధర్మాసనం
ఈ చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ యునైటెడ్ ఫోరం ఫర్ క్యాంపెయిన్ అధ్యక్షుడు సత్యనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఓ పక్క న్యాయస్థానాల్లో బెయిల్ పిటిషన్‌పై విచారణలు జరుగుతుండగా, వీరు మీడియా సమావేశాలను నిర్వహించి ప్రజాధనం దుర్వినియోగం చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిల్ ను పరిశీలించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం .. సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం .. తదుపరి విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.