ఏపీలో ఇంటింటి గణన ప్రారంభం... స్వయంగా తన వివరాలు నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu starts house listing enumeration in AP
  • ఏపీలో ఇంటింటి గణన, గృహాల జాబితా సేకరణ ప్రారంభం
  • స్వీయ నమోదు ప్రక్రియను ఆరంభించిన సీఎం చంద్రబాబు
  • ఆన్‌లైన్‌లో తన వివరాలను స్వయంగా నమోదు చేసుకున్న ముఖ్యమంత్రి
  • మొత్తం 33 ప్రశ్నలతో కూడిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ
  • ఈ నెల 30వ తేదీ వరకు ప్రజలు వివరాలు నమోదు చేసుకునే అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటి గణన, గృహాల జాబితా సేకరణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా చేపట్టిన స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన వివరాలను నమోదు చేసి ఆరంభించారు. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఆయన ఈ ప్రక్రియను పూర్తి చేశారు.

రాష్ట్ర జనాభా గణన సంచాలకులు జె. నివాస్ ఈ కార్యక్రమం గురించి ముఖ్యమంత్రికి వివరించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు se.census.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి తన వివరాలను నమోదు చేశారు.
ఈ స్వీయ నమోదు ప్రక్రియలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని అధికారులు కోరారు. 

ప్రజలు తమ ఇళ్లకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకునేందుకు ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం కల్పించారు. దీనివల్ల జనగణన ప్రక్రియ మరింత సులభతరం, వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh
House listing
Population Census
Self Enumeration
AP Census 2024
Online Portal
J Nivas
Census India
AP Government

More Telugu News