'అన్ లిమిటెడ్ ఫన్.. అన్ ఫిల్టర్డ్ రోజా' ... బుల్లితెరపైకి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్న రోజా

Roja to Re enter Small Screen with The Family Assembly
  • సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బుల్లితెరపై మెరవబోతున్న రోజా
  • ఏప్రిల్ 19 మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో షో లాంచ్
  • అసెంబ్లీని తలపించేలా కుటుంబ సభ్యుల మధ్య సరదా చర్చలు, హంగామా

నటిగా, రాజకీయ నాయకురాలిగా తనదైన ముద్ర వేసిన రోజా... సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బుల్లితెరపై మెరిసేందుకు సిద్ధమయ్యారు. జీ తెలుగు వేదికగా ‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’ అనే సరికొత్త ఫన్ రియాలిటీ షోతో ఆమె త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ షోలో రోజా ఒక సింహాసనంపై కూర్చుని తన పాత 'జబర్దస్త్' మేనరిజమ్స్‌తో కనిపిస్తున్నారు. "Unlimited Fun, Unfiltered Roja" అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ షోలో ఆమె తనదైన శైలిలో పంచ్ లు, నవ్వులతో సందడి చేయనున్నారు. ‘అధ్యక్షా..’ అంటూ అసెంబ్లీని తలపించే రీతిలో కుటుంబ సభ్యుల మధ్య జరిగే సరదా చర్చలు, హంగామా ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఏప్రిల్ 19 మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగు ఛానల్‌తో పాటు జీ5 (ZEE5) ఓటీటీలో ఈ షో గ్రాండ్ లాంచ్ కానుంది.


చాలా కాలం తర్వాత రోజా మళ్లీ వినోద రంగంలోకి అడుగుపెడుతుండటంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసేలా రూపొందించిన ఈ షో, వారాంతంలో ప్రేక్షకులకు పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడం ఖాయంగా కనిపిస్తోంది.

Go Back to Shorts
Roja
Roja Selvamani
The Family Assembly
Zee Telugu
ZEE5
Telugu TV Show
Reality Show
Jabardasth
Telugu Entertainment
Political Leader

More Telugu News